Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్‌ప్రదేశ్ బ్యాలెట్ సమరం : పోలింగ్‌కు సర్వం సిద్ధం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల ప్రచారం మంగళవారంతో ముగిసింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకుగాను నవంబరు 9వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. అన్ని స్థానాల్లో కాంగ్రెస్,

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (09:31 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల ప్రచారం మంగళవారంతో ముగిసింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకుగాను నవంబరు 9వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. అన్ని స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేస్తున్నాయి. అలాగే, సీపీఎం 14 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుండగా, ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి 187మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
 
ఈ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ - బీజేపీ పార్టీలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాయి. కాంగ్రెస్‌ అవినీతిని ఎండగడుతూ ప్రధాని మోడీ ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ప్రచారంలో నోట్లరద్దు, జీఎస్టీలపై కేంద్రాన్ని టార్గెట్‌ చేశారు. గుజరాత్‌ మోడల్‌ విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున సీఎం అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ దుమాల్‌ను బీజేపీ ప్రకటిస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ పైనే గంపెడాశలు పెట్టుకుంది. 
 
పర్వత రాష్ట్రంలోని మొత్తం 68 నియోజకవర్గాల్లో బరిలో 338 అభ్యర్థులు నిలిచారు. వీరిలో మహిళలు 19 మందే ఉండటం గమనార్హం. మొత్తం 50.25 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 7525 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధర్మశాల నియోజకవర్గంలో అత్యధికంగా 12 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అత్యల్పంగా ఝన్‌దుట ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానంలో ఇద్దరే పోటీలో ఉన్నారు. మొత్తం నియోజకవర్గాల్లో ఒకే విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు.
 
ఇకపోతే.. ఈ ఎన్నికల్లో బీజేపీకే విజయావకాశాలు మెండుగా ఉన్నట్టు సర్వేలు చెపుతున్నాయి. 2012లో కాంగ్రెస్‌ 42.8 శాతం ఓట్లు సాధించగా బీజేపీ 38.5శాతంతో గట్టిపోటీ ఇచ్చింది. 2007లో బీజేపీకి అధికారం దక్కినప్పుడు 43.8 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 38.9 శాతం దక్కడం గమనార్హం. ఇదే తరహాలో గడిచిన 8 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు సత్తా చాటుతున్నాయి. అయితే ఈ సారిదానికి విరుద్ధంగా బీజేపీ భారీ విజయాన్ని సాధిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments