Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా తమ్ముడు ఓ పొరికి... శశికళతో కుమ్మక్కై అత్తను చంపేశాడు: దీపా జయకుమార్

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కోసం అక్కాతమ్ముడు వీధికెక్కారు. జయలలిత ఆస్తులకు సంబంధించి వీలునామా తన వద్ద ఉందంటూ దీపా జయకుమార్ చెపుతుంటే.. కాదుకాదు ఆ వీలునామా తనవద్దే ఉందంటూ ఆమె సోదరుడు దీపక్ చెపుతు

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (09:29 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కోసం అక్కాతమ్ముడు వీధికెక్కారు. జయలలిత ఆస్తులకు సంబంధించి వీలునామా తన వద్ద ఉందంటూ దీపా జయకుమార్ చెపుతుంటే.. కాదుకాదు ఆ వీలునామా తనవద్దే ఉందంటూ ఆమె సోదరుడు దీపక్ చెపుతున్నారు. ఈ ఆస్తి తగాదాలు వీరిద్దరిని రోడ్డున పడేలా చేశాయి.
 
ముఖ్యంగా, తన అనుచరులతో కలిసి పోయేస్ గార్డెన్‌కు వెళ్లిన ఆమెను వేదనిలయంలోకి వెళ్లకుండా ఆమె సోదరుడు దీపక్ అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు.
 
ఈ సందర్భంగా దీపా మాట్లాడుతూ తన మేనత్త జయలలితను శశికళతో కలిసి తన సొంత తమ్ముడు దీపక్‌ చంపేశాడని ఆరోపించారు. శశికళతో కుమ్మక్కై తన సోదరుడే అత్త (జయలలిత)ను అంతమొందించాడని, ఇప్పుడు దినకరన్‌తో చేతులు కలిపి తనను అంతమొందించాలనుకుంటున్నాడని ఆరోపించారు. 
 
పొయేస్ గార్డెన్‌కు రావాలని ఫోన్ చేసిన దీపక్ తాను అక్కడికి చేరుకున్న అనంతరం తనను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తన తమ్ముడు ఓ పొరికి అని అందుకే ఇలా నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments