Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అపరాధం.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (09:37 IST)
కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పకు ఆ రాష్ట్ర హైకోర్టు అపరాధం విధించింది. ఓ కేసులో దర్యాప్తు కొనసాగకుండా అర్జీ వేసినందుకుగాను కోర్టు బెంచ్ ఈ నిర్ణయం తీసుకుని 25 వేల రూపాయల అపరాధాన్ని విధించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరు సమీపంలోని గంగేనహళ్లిలో 1.11 ఎకరాల భూమి డీనోటిఫికేషన్ ద్వారా యడియూరప్ప లబ్ధి పొందారన్న ఆరోపణలపై 2015లో కేసు నమోదైంది. కలబురగి హైకోర్టు సంచార బెంచ్‌లో సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమఠ ఈ పిల్ దాఖలు చేశారు. డీనోటిఫికేషన్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బంధువులకు కూడా మేలు జరిగిందని ఆయన ఆరోపించారు. 
 
తాజాగా, ఈ కేసు విచారణ సందర్భంగా దర్యాప్తును కొనసాగించాలని లోకాయుక్తను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు కొనసాగకుండా అర్జీ వేసిన యడియూరప్పకు న్యాయమూర్తి జస్టిస్ మేకేల్ డి కున్హా రూ.25 వేల జరిమానా విధించారు. కాగా, యడియూరప్పపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేసేందుకు కోర్టు గతంలోనే నిరాకరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments