Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీఎస్సీ ఎగ్జామ్.. చూచిరాత కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన కేసులో ఐపీఎస్ అధికారి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (07:23 IST)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన కేసులో ఐపీఎస్ అధికారి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఐపీఎస్ అధికారి సఫీర్ కరీం కావడం గమనార్హం. వీరిద్దరినీ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు పీటీ వారెంట్‌పై చెన్నైకు తరలించారు. 
 
శనివారం చెన్నైలో జరిగిన యూపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షల్లో ఐపీఎస్‌ అధికారి సఫీర్‌ కరీమ్‌ చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడిన సంగతి తెలిసిందే. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపగా, అసలు విషయం బహిర్గతమైంది. తన భార్య జాయిస్‌ సహకారంతోనే మాస్ కాపయింగ్‌కు పాల్పడినట్టు వెల్లడించాడు. దీంతో సోమవారం చెన్నై నుంచి హైదరాబాద్‌ చేరుకున్న దర్యాప్తు అధికారి అరవిందన్‌... జాయిస్‌తో పాటు లా ఎక్సలెన్స్‌ ఐఏఎస్‌ శిక్షణా కేంద్రం డైరెక్టర్‌ రాంబాబును 8 గంటల పాటు విచారించారు. 
 
ఆ తర్వాత అశోక్‌ నగర్‌లోని లా ఎక్సలెన్స్‌ శిక్షణా కేంద్రం నుంచి ల్యాప్‌టాప్‌, బ్లూటూత్‌ పరికరంతో పాటు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరింత మందిని విచారిస్తామని అరవిందన్‌ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments