Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత, కరుణానిధి, అఖిలేష్‌లకు చేతబడి చేశారు?.. ఓ జ్యోతిష్యుడి ఉవాచ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అనారోగ్యం పాలు కావడానికి కారణం వారి ప్రత్యర్థులు చేతబడి చేయించడమేనని ఓ జ్యోతిష్యుడు చెప్పారు. ఈ మేరకు పలు వెబ్‌సైట్లలో వార్తలు హల

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (11:30 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అనారోగ్యం పాలు కావడానికి కారణం వారి ప్రత్యర్థులు చేతబడి చేయించడమేనని ఓ జ్యోతిష్యుడు చెప్పారు. ఈ మేరకు పలు వెబ్‌సైట్లలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అలాగే, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కుటుంబంలో చిచ్చురగలడానికి కూడా ఈ చేతబడులేనని పేరు ఇష్టపడని ఆ జ్యోతిష్యుడు చెప్పుకొచ్చాడు. 
 
కాగా, గత నెల 22వ తేదీన ఆస్పత్రిలో చేరిన జయలలిత ఇంకా చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. అదేసమయంలో జయలలిత కోలుకుంటుండగా, ఇటీవలే కరుణానిధి కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఈయన అనారోగ్యానికి కూడా కారణం ప్రత్యర్థుల చేతబడేనని, ఇందుకు విరుగుడు చేయిస్తే వారిద్దరూ కోలుకుంటారని సదరు జ్యోతిష్కుడు పేర్కొన్నాడట. 
 
ఇదిలావుంటే, యూపీ సీఎం అఖిలేష్ కుటుంబంలో రగిలిన చిచ్చుకు కూడా కారణం చేతబడేనని పుకార్లు సంచారం చేస్తున్నాయి. అఖిలేష్ ప్రత్యర్థులే ఈ చేతబడి చేయించారని, అందువల్లే ములాయం కుటుంబంలో తండ్రీ కొడుకులు సైతం శత్రువులుగా మారి కలహించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ములాయం, అఖిలేష్‌లకు హాని కలిగించేందుకు తాంత్రిక ప్రయోగం జరుగుతోందంటూ ములాయం సోదరుడు రాంగోపాల్ ఆ మధ్య రాసిన ఒక లేఖను కొందరు ఉటంకిస్తున్నారు. ఈ క్రమంలో ములాయం రెండో భార్యపై కూడా ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments