Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు ఎవరు లేరు.. మృతదేహాన్ని ఎలా దహనం చేశారో తెలుసా? మంచానికి రెండు పొడవాటి?

పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకుంటూ.. చేతిలో చిల్లిగవ్వలేని స్థితిలో.. భార్య శవాన్ని తన భుజాలపైనే ఏకంగా 12 కి.మీ వరకు ఓ భర్త మోసుకుంటూ వెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ ఘటన

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (11:19 IST)
పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకుంటూ.. చేతిలో చిల్లిగవ్వలేని స్థితిలో.. భార్య శవాన్ని తన భుజాలపైనే ఏకంగా 12 కి.మీ వరకు ఓ భర్త మోసుకుంటూ వెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన ఒడిస్సాలోనే ఇప్పుడు మరో దారుణం చోటు చేసుకుంది. తాజాగా ఒడిశాలోని అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతమైన కలహందీలోని కోక్సారా బ్లాక్లోని మహిమా పంచాయత్లో సావిత్రి జువాయిడ్ అనే మహిళ మృతిచెందింది. 
 
సవర కులానికి చెందిన సావిత్రి, గౌడ కులానికి చెందిన వ్యక్తిని కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా సంసారజీవితాన్ని గడిపారు. కాగా కొన్ని నెలల క్రితం ఆమె భర్త మరణించాడు. ఆ తర్వాత అనారోగ్యం బారినపడ్డ సావిత్రి కూడా మృతి చెందింది. తమకెవరూ బంధువులు లేకపోవడంతో ఆమెకు అంత్యక్రియలు జరపాలని సహాయం చేయాలని గ్రామస్థులను ఆమె కుటుంబ సభ్యులు కోరారు. 
 
అయితే, ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని మంచానికి రెండు పొడవాటి వెదురు బొంగులు కట్టి ఆ మంచంపై పెట్టి, ఈడ్చుకుంటూ వెళ్లి దహనం చేశారు. దీనిని చూసిన కొంత మంది జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించడంతో ఇతర కార్యక్రమాలు పూర్తిచేయాలని ఆదేశిస్తూ, కొంత మంది వ్యక్తులకు 2000 రూపాయలు ఇచ్చి పంపించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఉంది - విలన్ పాత్రలకు రెడీ : మిమో చక్రవర్తి

వెంకీ-మహేష్ బాబులకు తండ్రిగా రజినీకాంత్, ఆయన ఏమన్నారో తెలుసా?

వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారా? యూట్యూబర్లపై హీరో ఫైర్!

Aditya 369: ఆదిత్య 369: సమ్మర్‌లో రీ-రిలీజ్‌.. 4K రిజల్యూషన్‌‌తో వచ్చేస్తున్నాడు..

అభిమానమంటే ఇదికదరా! మార్మోగిపోతున్న గ్లోబల్ స్టార్ ఇమేజ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

తర్వాతి కథనం
Show comments