Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడనాడు ఎస్టేట్‌లో హత్యలు.. దోపిడీలు.. 20 సీసీ కెమెరాలు, చెక్ పోస్టుల ఏర్పాటు.. 

కొడనాడు వేసవి విడిది కేంద్రానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం.. కొడనాడు ఎస్టేట్‌లో హత్యలు, దోపిడీలు జరిగిన నేపథ్యంలో కొడనాడు ఎస్టేట్‌కు భారీ భద్రత కల్పించే

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (10:29 IST)
కొడనాడు వేసవి విడిది కేంద్రానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం.. కొడనాడు ఎస్టేట్‌లో హత్యలు, దోపిడీలు జరిగిన నేపథ్యంలో కొడనాడు ఎస్టేట్‌కు భారీ భద్రత కల్పించే దిశగా.. 20 సీసీ కెమెరాలను, అన్ని మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అమ్మ బతికున్నంత వరకూ భద్రత వలయంలో ఉన్న ఎస్టేట్‌కు.. అమ్మ మరణానంతరం భద్రత తొలగిపోయింది. 
 
అదే అదనుగా వాచ్ మెన్‌ను హత్య చేసిన దుండగులు, అక్కడున్న విలువైన వస్తువులను, నగదును అపహరించుకుపోయారని వార్తలు సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు ఎస్టేట్ లోకి డ్రోన్ కెమెరాలను పంపి పరిసరాలను చూస్తున్నారని తెలియడంతో, మరేవైనా అనుమానాస్పద ఘటనలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక్కడి తేయాకు తోటల నుంచి రోజుకు వెయ్యి కిలోల వరకూ తేయాకు మాయం అవుతున్న అనుమానాలూ కలగడంతో, పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో చెక్ పోస్టులను సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ వైపుగా ఏ వాహనం వెళ్లినా, వారి వివరాలు, వాహనం నంబర్లు, ప్రయాణిస్తున్న వారి పేర్లను నమోదు చేస్తున్నామని నీలగిరి ఎస్పీ మురళీ రంభ వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments