Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీటు విషయంలో వాగ్వాదం... విమానం దిగేటప్పుడు ముష్టిఘాతాలు.. (Video)

సాధారణంగా మన ఆర్టీసీ బస్సుల్లో సీటు కోసం కొట్టుకోవడం, జుట్లుజుట్లు పట్టుకోవడం వంటి సంఘటనలు చూస్తుంటాం. ఇపుడు అదే తరహా ఘటన ఒకటి విమానంలో జరిగింది. ఇద్దరు ప్రయాణికుల మధ్య సీటు కోసం వాగ్వాదం జరిగింది. ఆ

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (10:28 IST)
సాధారణంగా మన ఆర్టీసీ బస్సుల్లో సీటు కోసం కొట్టుకోవడం, జుట్లుజుట్లు పట్టుకోవడం వంటి సంఘటనలు చూస్తుంటాం. ఇపుడు అదే తరహా ఘటన ఒకటి విమానంలో జరిగింది. ఇద్దరు ప్రయాణికుల మధ్య సీటు కోసం వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వారిద్దరు ఘర్షణ పడ్డారు. చివరకు విమానం దిగే సమయంలో మరోమారు ఘర్షణ పడి.. ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈ ఘటన తాజాగా సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌ లైన్స్‌‌కు చెందిన విమానంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... డల్లాస్‌ నుంచి ఆక్లాండ్‌‌కు వెళ్తుండగా ఇద్దరు ప్రయాణికులు సీటు కోసం వాదించుకున్నారు. ఆ తర్వాత శాంతించారు. మార్గమధ్యంలో కాలిఫోర్నియాలోని బర్బంక్‌ బాబ్‌‌హోప్‌‌ ఎయిర్‌ పోర్టులో ఆగింది. ప్రయాణికులు కిందకు దిగుతుండగా ఇద్దరు యువకులు ఒక్కసారిగా కలబడ్డారు. ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు.
 
దీనిని చూసి ఆపేందుకు వచ్చిన ప్రయాణికులను కూడా వారు కనికరించలేదు. అమాంతం వారితోపాటు ప్రత్యర్థిని సీట్ల కింద పడేసిన ఓ యువకుడు, ప్రత్యర్థిపై పిడిగుద్దులు కురిపించాడు. దీనిని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. దీనిపై విమాన సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments