చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో వున్న వాయుగుండం గురువారం రాత్రి తమిళనాడులోని కరైకాల్-శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ వాయుగుండం ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. చెన్నై మహానగరం సహా మరో 8 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. నెల్లూరులో భారీ వర్షం కురుస్తుందని వెల్లడించారు.
నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.