11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (11:49 IST)
భోపాల్ నుంచి ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలు ఏకంగా 11 గంటల పాటు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ఆ రైలులో ప్రయాణించిన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ రైలు ఇన్ని గంటల పాటు ఆలస్యంగా నడవడానికి సాంకేతిక లోపమే కారణమని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌కు వెల్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోని రాణి కమలపాటి రైల్వేస్టేషన్ నుంచి సాంకేతిక లోపం కారణంగా 11 గంటల ఆలస్యంగా బయలుదేరింది. 
 
ఈ రైలు సాధారణంగా రాణి కమలాపతి స్టేషన్ నుంచి ఉదయం 5.40 గంటలకు బయలుదేరాల్సివుంది. అయితే, సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం బయలుదేరిందని అధికారులు తెలిపారు. దీంతో కోపోద్ర్రిక్తులైన ప్రయాణికులు రైలు పట్టాలపై కూర్చొని తమ నిరసన తెలిపారు. రైలు ఆలస్యం గురించి తమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అయితే, భోపాల్ డివిజన్ పీఆర్వో నావల్ అగర్వాల్ మాట్లాడుతూ, సాంకేతిక కారణాల వల్ల రైలు ఆలస్యమైందని, అయితే, రైలు సంబంధింత యాప్‌‍లతో సహా పలు మార్గాల ద్వారా రైలు ఆలస్యంపై ప్రయాణికులకు సమాచారం అందించామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments