Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సునీతా విలియమ్స్‌ను భూమిపైకి వస్తారా? లేదా? డాక్టర్ సోమనాథ్ ఏమంటున్నారు...

sunitha williams

వరుణ్

, ఆదివారం, 30 జూన్ 2024 (16:54 IST)
అంతరిక్ష ప్రయాణానికి వెళ్లిన ఇండో అమెరికన్ వ్యామగామి సునీతా విలియమ్స్ తిరిగి భూమికి చేరుకోవడంలో చిక్కులు నెలకొన్నాయి. ఆమె ప్రయాణించిన బోయింగ్ స్ట్రీమ్ లైనర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ కారణంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్ బార్ట్ విల్మోర్ ఐఎస్ఎస్ నుంచి తిరిగిరావడం వాయిదాపడింది. ప్రస్తుతం వారిద్దరూ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలోనే ఉన్నారు. అయితే, ఇద్దరు ఆస్ట్రోనాట్స్ భూమికి తిరిగిరావడంలో జాప్యం అంత ఆందోళనకారక అంశం కాదని ఛైర్మన్ డా.సోమనాథ్ అభిప్రాయపడ్డారు. ఐఎస్ఎస్ ఎంతో భద్రమైన ప్రదేశమని వ్యాఖ్యానించారు. అక్కడ తొమ్మిది మంది వ్యోమగాములు ఉన్నారని గుర్తు చేశారు. వారిలో ఇద్దరు తిరిగిరావడంలో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయని స్పష్టం చేశారు.
 
'వాళ్లందరూ ఏదోక రోజు తిరిగి రావాల్సిందే. బోయింగ్ నిర్మించిన క్రూ మాడ్యుల్ స్టార్ లైనర్‌ను పరీక్షించడమే ఇక్కడ ప్రధాన అంశం. వ్యోమగాములను అంతరిక్షానికి తరలించి తిరిగి తీసుకొచ్చే సామర్థ్యం స్టార్నర్‌కు ఉందా లేదా అనేది పరీక్షిస్తున్నారు. అయితే, భూమి నుంచి కొత్త వ్యోమనౌకను పంపించి వెనక్కు రప్పించే లాంచ్ ప్రొవైడర్లు సిద్ధంగా ఉన్నాయి. అసలు ఇది సమస్యే కాదు. ఐఎస్ఎస్ ఓ భద్రమైన ప్రదేశం. ఎంతకాలం కావాలంటే అంతకాలం అక్కడ ఉండొచ్చు' అని పేర్కొన్నారు. 
 
కాగా, 'స్టార్ లైనర్ వంటి ఎయిర్ క్రాఫ్టులు సక్రమంగా పనిచేయగలవా లేదా అనేది ఇక్కడ ప్రధాన సమస్య. ప్రస్తుతం అంతరిక్ష ఏజెన్సీలు ఇదే అంశంపై దృష్టి పెట్టాయి. అయితే, సునీతా విలియమ్స్ ధైర్యసాహసాలు అందరికీ గర్వకారణం. ఇప్పటికే ఎన్నో మిషన్లు ఆమె దిగ్విజయంగా పూర్తి చేసింది. స్టార్ లైనర్ నిర్మాణంలో కూడా ఆమె తన అనుభవాల ఆధారంగా పలు సూచనలు చేశారు. ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావాలని కోరుకుంటున్నా. మరిన్ని వ్యోమనౌకల నిర్మాణాల్లో పాలుపంచుకోవాలని ఆశిస్తున్నా' అని డాక్టర్ సోమనాథ్ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే