Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే

Advertiesment
dk shivakumar

వరుణ్

, ఆదివారం, 30 జూన్ 2024 (13:19 IST)
కర్నాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్‌ను చేయాలంటూ ఓ మతపెద్ద సలహా ఇచ్చారు. దీనిపై డీకే శివకుమార్ స్పందించారు. తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఎవరూ సిఫార్సు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. తన పనితీరు ఆధారంగా పార్టీ హైకమాండ్ తగు నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 
 
బెంగళూరులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'ప్రస్తుతం రాష్ట్రంలో డిప్యూటీ సీఎం, సీఎం పదవిపై ఎటువంటి చర్చా లేదు. నాపై అభిమానంతో చంద్రశేఖర నాథస్వామి అలా మాట్లాడారు. అయితే, నన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఎవరూ సూచించవద్దని కోరుతున్నా. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం, నేను, హైకమాండ్ కలిసి ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఏకాభిప్రాయానికి వచ్చాము. ఎమ్మెల్యేలు, మంత్రులు, లేదా మతపెద్దలు ఈవిషయంలో స్పందించాల్సిన అవసరం లేదు. నాకు మద్దతుగా నిలవాలనుకున్న వారు దేవుడిని నా కోసం ప్రార్థించాలి. అక్కడితో ఈ విషయం ముగిసిపోవాలి' అని కోరారు. 
 
అంతేకాకుండా, "ఈ విషయంలో మంత్రులెవరూ మీడియాతో మాట్లాడొద్దని కోరుతున్నా. సీఎం పోస్టుపై బహిరంగ ప్రకటనలు చేసిన వారికి ఏఐసీసీ ద్వారా నోటీసులు వస్తాయి. పార్టీని అధికారంలో తెచ్చేందుకు మనందరం ఎంతో కృషి చేశాం. కాబట్టి, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంపై మౌనంగా ఉండటమే శ్రేయస్కరం. కాబట్టి, మతపెద్దలు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని సవినయంగా మనవి చేస్తున్నా' అని డీకే శివకుమార్ అన్నారు. 
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు