Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు డెడ్‌లైన్ - బలనిరూపణకు గవర్నర్ ఆదేశం

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (09:22 IST)
మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. మహరాష్ట్ర ముఖ్యమంత్రి  ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ భగవత్ సింగ్ కోశ్యారి డెడ్‌లైన్ విధించారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకోవాలని ఆయన కోరారు. దీంతో గురువారం సాయంత్రం 5 గంటలలోపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భవితవ్యం తేలిపోనుంది. 
 
అధికార శివేసన పార్టీలో వచ్చిన చీలికల కారణంగా మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తింది. తిరుగుబాటు నేత ఏక్‌‍నాథ్ షిండే సారథ్యంలో శివసేన ఎమ్మెల్యేలు కొందరు ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మహారాష్ట్ర సర్కారు మైనార్టీలో పడిపోయింది. ఏక్‌నాథ్ షిండే వెంట 40 మందికిపై పాగా ఎమ్మెల్యేలు ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో బలపరీక్షకు గవర్నర్ కోశ్యారి ఆదేశించండంతో గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఇది ఒకే అజెండాతో అసెంబ్లీ సమావేశం అవుతుందని రాజ్‌భవన్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఇదిలావుంటే బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ముంబైకు చేరుకుని గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మైనార్టీలో ఉందని, మెజార్టీ నిరూపించుకునేలా ఆదేశించాలని కోరారు. దీంతో గవర్నర్ అసెంబ్లీలో బలనిరూపణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments