Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌సీఆర్ పరిధిలోని 14 జిల్లాల్లో బాణాసంచా విక్రయాలపై నిషేధం

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (17:12 IST)
హర్యానా రాష్ట్రంలోని నేషనల్‌ క్యాపిటర్‌ రీజియన్‌(ఎన్.సి.ఆర్) పరిధిలోకి వచ్చే 14 జిల్లాల్లో బాణాసంచా విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. టపాకాయల అమ్మకాలు, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. 
 
పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, కేవలం గ్రీన్‌ క్రాకర్స్‌ వినియోగానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. వాటిని కాల్చేందుకు కూడా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సమయాన్ని నిర్దేశించింది. 
 
దీపావళి పండుగ రోజున కేవలం రెండు గంటలను మాత్రమే గ్రీన్‌ క్రాకర్స్‌ను కాల్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. దీపావళి పండుగ రోజున రాత్రి 8 నుంచి 10 గంటల వరకు, ఛట్‌ పూజ సందర్భంగా ఉదయం 6-8 గంటల వరకు, క్రిస్మస్‌, నూతన సంవత్సరం సందర్భంగా రాత్రి 11.55-12.30 పటాకులు పేల్చేందుకు అనుమతి ఇచ్చింది.
 
కాగా, ప్రభుత్వ నిషేధ ఆంక్షలను ఉల్లంఘించి ఎవరైనా టపాకాయలను విక్రయిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా, పోలీసు బృందాలు తనిఖీలు చేపడుతాయని హెచ్చరించింది. 
 
శీతాకాలం, కరోనా మహమ్మారి నేపథ్యంలో పటాకులు పేల్చడం ద్వారా వాయు కాలుష్యంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో బ్యాన్‌ విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. 
 
ఈ నిషేధం భివానీ చర్కీ, దాద్రీ, ఫరీదాబాద్‌, గురుగ్రామ్‌, ఝజ్జర్‌, జింద్‌, కర్నాల్‌, మహేంద్రగఢ్‌, నూహ్‌, పల్వల్‌, పానిపట్‌, రోహ్తక్‌, రేవారి, సోనెపట్‌లో నిషేధం అమలులో ఉండనున్నది. మరో వైపు పంజాబ్‌లోనూ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments