Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరియాణలో వికసిస్తున్న కమలం: వచ్చినట్లే వచ్చి వెనక్కిపోతున్న హస్తం

ఐవీఆర్
మంగళవారం, 8 అక్టోబరు 2024 (12:04 IST)
హరియాణలో సంబరాల్లో తేలిపోతున్న కాంగ్రెస్ పార్టీకి కమలం కాస్త ఝలక్ ఇస్తోంది. తొలుత కిందపడ్డట్లు కనిపించన భాజపా మళ్లీ పుంజుకుంది. 50 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇక కౌంటింగ్ ఆరంభ ట్రెండ్స్ విషయానికి వస్తే.. హర్యానాలో భాజపా అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా భాజపా 50కిపై స్థానాల్లో ఆధిక్యంలో వుంది. భాజపా లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం 34 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
 
ఇక దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు ఎన్నికలు జరుపుకున్న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ బీజేపీ, కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మధ్య హోరాహోరీ పోరు ఖాయమని ఆరంభ ట్రెండ్‌ను బట్టి అర్థమవుతోంది. జమ్మూ కాశ్మీర్ కూడా కాంగ్రెస్ కూటమి 34కు పైగా స్థానాల్లో, బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
 
ఇకపోతే, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటింగుకు ముందే సంబరాలను మొదలుపెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో కౌంటింగ్ మొదలు కాకముందే హస్తం పార్టీ నాయకులు వేడుకలు మొదలుపెట్టారు. కాగా హర్యానా, జమ్మూ కశ్మీర్ రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ 90 సీట్లు ఉన్నాయి. మేజింగ్ ఫిగర్ 46 సీట్లుగా ఉంది. జమ్ము-కాశ్మీర్ కాంగ్రెస్ కూటమి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుంటే, హర్యానాలో నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బింగ్ సినిమాలపై అబ్బూరి రవి విమర్శలకు సొల్యూషన్ దొరుకుతుందా?

త్వరలోనే ప్రభాస్ పెళ్లి... స్పష్టత ఇచ్చిన పెద్దమ్మ శ్యామలాదేవి

హారర్ థ్రిల్లర్ గా ది రాజా సాబ్ ఏప్రిల్ 10న రాబోతుందన్న డైరెక్టర్ మారుతి

శివకార్తికేయన్, సాయి పల్లవి చిత్రం అమరన్ లో ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేసిన నితిన్

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటున్న నిఖిల్ సిద్ధార్థ్‌, రుక్మిణి వ‌సంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు తేనెలో ఇవి కలిపి తీసుకుంటే...

రాత్రి భోజనం ఆరోగ్యకరంగా వుండాలంటే?

గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా త్రిప్తి డిమ్రీని ప్రకటించిన ఫరెవర్ న్యూ

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments