Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే ధ్వంసం కేసులో హార్దిక్ పటేల్‌కు జైలుశిక్ష

గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే రిషికేష్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో పటీదార్ ఉద్యమ యువ నేత హార్దిక్ పటేల్‌కు స్థానిక కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హార్దిక్‌తోపాటు లాల్జ

Webdunia
బుధవారం, 25 జులై 2018 (14:53 IST)
గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే రిషికేష్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో పటీదార్ ఉద్యమ యువ నేత హార్దిక్ పటేల్‌కు స్థానిక కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హార్దిక్‌తోపాటు లాల్జీ పటేల్, ఏకే పటేల్‌కు కూడా ఇదే శిక్షపడింది. రూ.50 వేల జరిమానా కూడా కట్టాలని కోర్టు ఆదేశించింది.
 
గత 2015లో జరిగిన గుజరాత్ పటీదార్ ఉద్యమ సమయంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో విస్ నగర్‌లోని బీజేపీ ఎమ్మెల్యే రుషికేష్ ఆఫీస్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ ఆందోళనలో మూడు వేల మంది పాల్గొన్నారు. 17 మందిపై కుట్ర, దాడి, అల్లర్ల కేసులు నమోదు అయ్యాయి. 
 
ఈ కేసులో అరెస్టు అయిన హార్దిక్ పటేల్.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యారు. అనంతరం కొన్ని నెలలు మెహసానా జిల్లాలోకి ప్రవేశించకుండా కోర్టు కూడా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు తీర్పును వెలువరించగా, ఇందులో హార్దిక్ పటేల్‌కు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
కాగా, ఈ కోర్టు తీర్పుకి ముందే హార్దిక్ పటేల్ తన అనుచరులతో కీలక భేటీ నిర్వహించారు. కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళనలకు దిగొద్దని సూచించారు. అలా వారు ఊహించినట్టుగానే కోర్టు తీర్పు వెలువడటంతో ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments