Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ టెక్కీకి లైంగిక వేధింపులు.. గేర్ మార్చుతున్నట్టుగా మోకాళ్ళపై...

కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఓ మహిళా టెక్కీ లైంగిక వేధింపులకు గురైంది. క్యాబ్ డ్రైవరే ఈ పాడు పనికి పాల్పడ్డాడు. క్యాబ్ ఎక్కిన టెక్కీ పట్ల స్నేహంగా ఉన్నట్టు నటిస్తూనే తన పక్క సీట్లో కూర్చోబెట్టు

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (08:58 IST)
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఓ మహిళా టెక్కీ లైంగిక వేధింపులకు గురైంది. క్యాబ్ డ్రైవరే ఈ పాడు పనికి పాల్పడ్డాడు. క్యాబ్ ఎక్కిన టెక్కీ పట్ల స్నేహంగా ఉన్నట్టు నటిస్తూనే తన పక్క సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత గేర్ మార్చుతున్నట్టుగా మోకాళ్ళపై చేయి వేసి తడుముతూ వేధించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే....
 
తిరువనంతపురం నగరంలోని టెక్నో పార్కులో పనిచేస్తున్న ఓ మహిళా సాప్ట్‌వేర్ ఇంజనీరు రాత్రివేళ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్‌ను బుక్ చేసుకుంది. ఐటీ పార్కు నుంచి కజకుట్టంలోని ఇంటికి క్యాబ్‌లో తీసుకువెళుతూ డ్రైవరు మార్గమధ్యంలో అక్కులం వద్ద మహిళా ఉద్యోగినితో స్నేహంగా నటిస్తూ ఆమెను తన పక్క సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత గేర్ మార్చుతున్నట్టుగా మహిళ మోకాళ్ల వరకు చేతులతో తడిమి లైంగికంగా వేధించాడు. 
 
అంతే ఒక్కసారి నిశ్చేష్టురాలైన ఆ టెక్కీ... క్యాబ్ ఆపాలంటూ బిగ్గరగా అరిచింది. దీంతో క్యాబ్ ఆపిన డ్రైవరు తాను చేసిన చర్యకు మహిళకు క్షమాపణ చెప్పి వెళ్లాడు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసేందుకు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడైన క్యాబ్ డ్రైవరును అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం