Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరుబావిలో బాలిక.. కాపాడటానికి 16 గంటలుగా తీవ్ర ప్రయత్నాలు.. కన్నతల్లి ఆర్తనాదం

చేవెళ్ల మండలం ఇక్కరెడ్డిగూడలో ఏడాదిన్నర చిన్నారి మీనా బోరుబావిలో పడింది. 19 నెలల చిన్నారి. సరదాగా ఆడుకుంటూ ఉన్నట్టుండి బోరుబావిలో పడిపోయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెల్లి పంచాయతీ పరిధిలో ని ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం 6.30కి ఈ

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (07:08 IST)
చేవెళ్ల మండలం ఇక్కరెడ్డిగూడలో ఏడాదిన్నర చిన్నారి మీనా బోరుబావిలో పడింది. 19 నెలల చిన్నారి. సరదాగా ఆడుకుంటూ ఉన్నట్టుండి బోరుబావిలో పడిపోయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెల్లి పంచాయతీ పరిధిలో ని ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం 6.30కి ఈ సంఘటన జరిగింది. వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం గోరెపల్లికి చెందిన యాదయ్య, రేణుక దంపతులు బతుకుదెరువు కోసం చేవెళ్ల మండలానికి వలస వచ్చారు. వారు స్థానిక పాలీహౌస్‌లో పనిచేస్తున్నారు. వీరికి అక్షిత, చిన్నారి ఇద్దరు కూతుళ్లు.
 
గురువారం సాయంత్రం చిన్నారి పాలీహౌస్‌ పక్కనే ఆడుకుంటూ మల్లారెడ్డి అనే వ్యక్తికి చెందిన పొలంలోని బోరుబావి వద్దకు వెళ్లి అందులో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. బోరు బావికి సమాంతరంగా పొక్లెయిన్‌తో గుంత తవ్వుతున్నారు. బోరులోకి ఆక్సిజన్‌ పంపుతున్నారు.
 
చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని మంత్రి మహేందర్ రెడ్డి పరిశీలించారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments