Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 సంవత్సరాలు మాత్రమే జీవించాలని నిర్ణయం.. ఆ వయసు రాగానే ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (12:51 IST)
ఆ యువకుడు కేవలం మూడు పదుల వయస్సు వరకు మాత్రమే జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఇపుడు ఆ వయసు రాగానే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోర్‌లోని హిరా నగర్ ప్రాంతంలోని అతడి ఇంట్లో రక్తపు మడుగులో పడివున్న యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన స్వీయ రక్షణ కోసం 2016లో తీసుకున్న తుపాకితోనే కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్టు గుర్తించారు. తాను జీవితాన్ని ముగిస్తున్నానని, దీనికి ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్‌లో రాసినట్టు పోలీసులు తెలిపారు.
 
'30 సంవత్సరాల వరకు మాత్రమే జీవించాలని 9 ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నా. నాకు జీవితంలో ఎలాంటి బాధలు లేవు' అని అతడు ఆ నోట్లో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. లేఖను బట్టి చూస్తే అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు అర్థమవుతోందని, అయినప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments