Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్ఞానవాపి కేసులో విచారణ మే 26కు వాయిదా

Webdunia
మంగళవారం, 24 మే 2022 (15:57 IST)
Gnanavapi
కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని... మసీదు సముదాయంలో పూజలు చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. 
 
వారణాసి కోర్టు నియమించిన సర్వే బృందం కూడా నివేదిక సమర్పించింది. ఇప్పటికే జ్ఞానవాపిలో శివలింగం బయటపడగా... రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
తాజాగా జ్ఞానవాపి మసీదు వివాదంపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. రేపటివరకు విచారణ కొనసాగించవద్దని వారణాసి కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను మే 26 మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. 
 
ఇకపోతే.. జ్ణానవాపి మసీదు గోడలపై ఉన్న శృంగేరీ దేవీతో పాటు ఇతర దేవతా మూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతివ్వాలంటూ ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. పిటీషన్‌ను విచారించిన సివిల్ జడ్జి వీడియోగ్రఫీ సర్వేకి ఆదేశాలు ఇచ్చారు.
 
జ్ణానవాపి మసీదులో దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు అందులోనే వెల్లడైంది. మసీదులోని బావిలో శివలింగం ఉన్నట్లు వీడియోగ్రఫీ సర్వేలో గుర్తించారు. 
 
శివలింగం ఉన్న ప్రాంతాన్ని పరిరక్షించాలని ఆదేశం ఇచ్చిన సుప్రీం కోర్టు… అదే సమయంలో ముస్లింలకు నమాజుకు ఎటువంటి ఆటంకం కలిగించవద్దొందటూ సూచించింది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం