Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో ఏర్పడిన వివాదం.. ముగ్గురు కుమారుల్ని పీకకోసి చంపేసిన కానిస్టేబుల్

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (11:30 IST)
భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదం ముగ్గురు సంతానాన్ని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మానవీయ అనుబంధాలు గాడితప్పుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలు చిన్న చిన్న గొడవలకే విడాకులు వరకు వెళ్తున్నాయి. అంతేగాకుండా దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. 
 
తాజాగా భార్యతో ఏర్పడిన గొడవ కారణంగా ఓ భర్త తన ముగ్గురు సంతానాన్ని పీకకోసి హతమార్చాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌, భావ్ నగర్‌కు చెందిన కానిస్టేబుల్ సుక్దేవ్ సియాల్. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం పూట సుక్దేవ్‌కు ఆతని భార్యతో గొడవలు జరిగాయి. ఈ వివాదం కారణంగా తన ముగ్గురు కుమారులు గుజాల్ (9), ఉద్దవ్ (5), మన్మీట్ (3)లను ఆవేశంతో గొంతుకోసి హత్య చేశాడు సుక్దేవ్. ఆపై సుక్దేవ్ సమీపంలోని పోలీస్ స్టేషన్‍‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుక్దేవ్ దంపతుల వద్ద విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments