Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో ర్యాగింగ్ భూతం.. 3 గంటల పాటు నిలబెట్టడంతో వైద్య విద్యార్థి మృతి

ఠాగూర్
మంగళవారం, 19 నవంబరు 2024 (14:44 IST)
గుజరాత్ రాష్ట్రంలో ర్యాగింగ్ భూతం బుసలుకొట్టింది. ఫలితంగా డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతో కాలేజీలో అడుగుపెట్టిన ఓ వైద్య  విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సీనియర్లు... ఆ జూనియర్ విద్యార్థిని ఏకంగా 3 గంటల పాటు ఎండలో నిలబెట్టడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనకు సంబంధించిన 15 మంది సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని జీఎంఈఆర్ఎస్ వైద్య కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 
 
మృతి చెందిన విద్యార్థిని అనిల్ మెథానియగా గుర్తించారు. గుజరాత్ రాష్ట్రంలోని ధారపుర్ పాటన్ ప్రాంతంలోని వైద్య కాలేజీలో చేరాడు. పరియం పేరుతో ద్వితీయ సంవత్సర విద్యార్థులు ప్రెషర్లపై ర్యాగింగ్ చేశారు. ఈ క్రమంలో జూనియర్లను మూడు గంటల పాటు నిల్చోవాలని ఆదేశించారు. దీంతో అనిల్ స్పృహ కోల్పోయి కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన సీనియర్లు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, అనిల్ చనిపోయేముందు ఇచ్చిన వాంగ్మూలంలో సీనియర్లు బలవంతంగా నిల్చోబెట్టడం వల్లే ఇలా జరిగిందంటూ వారి పేర్లను వెల్లడించాడు. ఇపుడు వారందరిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments