Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనకోడలితో కీచక మామ లింకు... పెళ్లి తర్వాత కుదరదన్నందుకు బ్లాక్‌మెయిల్

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (13:40 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఓ కీచక మేనమామ కథ వెలుగులోకి వచ్చింది. తన మేనకోడలికి మాయమాటలు చెప్పి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు తెలియకుండా ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీశాడు. కొన్ని నెలలకు ఆ యువతికి వివాహమైంది. వివాహం తర్వాత కూడా తనతో సంబంధం కొనసాగించాలని మేనమామ వేధించసాగాడు. కానీ, మేనకోడలు అంగీకరించలేదు. దీంతో ఏకాంతంగా ఉన్నపుడు తీసిన వీడియోలతో బెదిరించసాగాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రకు చెందిన ఓ యువతి సూరత్‌లోని పూనా ప్రాంతంలో చీరలపై లేస్ వర్క్ చేస్తూ జీవిస్తోంది. ఈ పనిని ఆమె మేనమామ(30) నేర్పించాడు. ప్రతి రోజు యువతి ఇంటికి ఆయన వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అతని నమ్మి అతనికి సర్వం సమర్పించింది. అయితే ఆమెతో ఏకాంతంగా గడిపిన సందర్భాలను ఆ వ్యక్తి వీడియో తీసి భద్రంగా దాచుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆ యువతికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మేనమామ.. యువతి దగ్గరికి వచ్చి పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పాటు అతన్ని దూరంగా పెట్టసాగింది. దీన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి... వారిద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోను యువతి తండ్రితో పాటు, వారి వర్గానికి చెందిన ఇతరులకు పంపాడు. అనంతరం యువతిని మానసికంగా వేధించసాగాడు. ఈ వేధింపులు మరింతగా ఎక్కువకావడంతో ఇక భరించలేని ఆ యువతి కుటుంబ సభ్యులు సూరత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం