Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ దెబ్బకు సచివాలయం మూసివేత.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (12:59 IST)
దేశంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఉన్న సచివాలయం నబన్నాను అధికారులు మూసివేశారు. సోమ, మంగళవారం రోజుల పాటు మూసివేస్తున్నట్టు తెలిపారు. 
 
సచివాలయంలో విధులు నిర్వహించే సబ్‌‌ఇన్‌స్పెక్టర్‌‌ ఒకరికి కరోనా పాజిటివ్‌గా పరీక్షించినట్లు పేర్కొన్నారు. దీంతో రెండు రోజుల పాటు శానిటేషన్‌ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎస్ఐని 14వ అంతస్తులోని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో విధుల్లో ఉన్నారని, హౌరా జిల్లా పక్కనే ఉన్న సచివాలయంలో రెండు రోజుల పాటు శానిటేషన్‌ పనులు చేపడుతారన్నారు. 
 
‘నబన్నా’ అధికారులు, సిబ్బంది సోమ, మంగళవారాల్లో ఇంటి నుంచే పని చేస్తారన్నారు. కాగా, ఎస్‌ఐ భార్యకు కూడా కరోనా పాజిటివ్‌గా పరీక్షించారని, ఇద్దరిని రాజర్‌హాట్‌ ప్రాంతంలోని దవాఖానలో చేర్పించారని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం 50 శాతం మంది సిబ్బందితో ‘నబన్నా’ పని చేస్తున్నప్పటికీ సీఎం మమతా బెనర్జీ ప్రతి రోజు కార్యాలయానికి హాజరవుతున్నారని అధికారి పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments