గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు షాక్ - బీజేపీలో చేరనున్న ఎమ్మెల్యేలు

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (15:52 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఐదుగురు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరంతా గుజరాత్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకాకముందే భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు. బీజేపీ అధినాయకత్వంతో వీరంతా టచ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 
 
ముఖ్యంగా, గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో మొన్నిటివరకు బీజేపీ ఎమ్మెల్యేలే. వారికి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వక పోవడంతో ఆప్ పార్టీలో చేరి గెలుపొందారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సృష్టించిన ప్రభంజనంతో వీరు కూడా మళ్లీ కాషాయం గూటికి చేరుకునేందుకు సిద్ధమైపోయారు. 
 
మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేర్చేలా ఒప్పించేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, మొన్నటి ఎన్నికల్లో ఆప్ ఏకంగా 12.92 శాతం ఓట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో ఆప్ ఐదు, బీజేపీ 156, కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలుపొందాయి. 
 
అయితే, గుజరాత్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఆప్ తరపున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. గుజరాత్ ఫలితాలతోనే ఆప్ పార్టీకి జాతీయ హోదా దక్కింది. అంతలోనే అది గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments