Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలపై వధువుపై చేయి చేసుకున్న వరుడు.. మొండికేసిన కుమార్తె

Webdunia
ఆదివారం, 7 మే 2023 (09:51 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్‌లో ఘటన జరిగింది. పెళ్లి పీటలపైనే వధువుపై వరుడు చేయి చేసుకున్నాడు. దీంతో అలిగిన వధువు పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయింది. పీకలవరకు మద్యం సేవించిన వరుడు... పెద్దల నుదుట వరుడు సింధూరం దిద్దలేకపోయాడు. పైగా, వధువుపై చేయి చేసుకున్నాడు. దీంతో అలిగిన వధువు... పెళ్లి పీటలపై నుంచి లేచి అలిగి వెళ్లిపోయింది. చివరకు ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. మీర్జాపూర్‌ జిల్లా మాణిక్‌పూర్‌లో జరిగింది. 
 
పెళ్లికి ముందు వధూవరులిద్దరూ కలిసి మండలంలో పూజలు నిర్వహించారు. అప్పటికే పీకల వరకు మద్యం సేవించి, మత్తులో ఉన్న వరుడు వధువు నుదుట సింధూరం దిద్దాల్సి ఉండగా, తడబడ్డాడు. నుదుట బొట్టు పెట్టేందుకు నానా తంటాలు పడ్డాడు. చివరికి ఆమె సింధూరం చల్లటం ప్రారంభించాడు. వధువు అతడిని ఆపే ప్రయత్నం చేయగా మైకం మత్తులో ఆగ్రహంతో ఊగిపోయిన వరుడు ఆమెపై చేయి చేసుకున్నాడు. 
 
దీంతో ఇలాంటి వాడిని తాను పెళ్లి చేసుకోబోనంటూ పీటలపై నుంచి వధువు లేచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇరు వర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు. చివరకు వధువు తరపు వారు చేసిన వివాహ ఖర్చులను తిరిగి చెల్లించేందుు వరుడు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వారి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments