Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్ల ఏనుగు చనిపోతే.. తల్లి ఏనుగుతో పాటు ఏనుగుల గుంపు ఏం చేసిందంటే? (వీడియో)

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (11:29 IST)
మనచుట్టూ తిరుగుతున్న ఓ వ్యక్తి చనిపోతే.. ఎంతటి బాధ మనుషులకు వుంటుందో.. అదే బాధ మూగ జీవాలను వుంటుంది. బాధకు తాము అతీతులమని కాదని.. తమలోనూ భావోద్వేగాలు వుంటాయని.. తాజాగా ఈ ఏనుగులు నిరూపించాయి. 
 
ఓ ఏనుగు తన బిడ్డ చనిపోతే, దాన్ని మోసుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. బాధతో దాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించింది. ఈలోగా, అక్కడికి వచ్చిన మిగతా ఏనుగులు, సంతాప సూచకంగా ఓ నిమిషం పాటు మౌనంగా నిలబడిపోయాయి. ఇంకా తల్లి ఏనుగు.. పిల్ల ఏనుగు మృతదేహాన్ని.. అడవిలోకి తీసుకెళ్లింది. 
 
పర్వీన్ అనే అటవీ అధికారి మొత్తం వీడియోను తీసి, ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. దాదాపు 20 ఏనుగుల గుంపు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇందులో మూడు గున్న ఏనుగులున్నాయి.

ఏనుగుల బృందం అలా పిల్ల ఏనుగును తీసుకెళ్తున్న దృశ్యాన్ని చాలామంది ప్రజలు కూడా వీక్షించారు. తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments