పఠాన్ కోట్‌లోని ఆర్మీ క్యాంపులో గ్రనేడ్ పేలుడు

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (12:10 IST)
punjab
పంజాబ్‌లోని పఠాన్ కోట్‌లోని ఆర్మీ క్యాంపు ఒక్కసారిగా గ్రనేడ్ పేలుడుతో ఉలిక్కిపడింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని ఆర్మీ క్యాంపు త్రివేణి గేట్ సమీపంలో గ్రనేడ్ పేలుడు సంభవించింది.

మిలటరీ హై సెన్సిటివ్ ఏరియా పఠాన్ కోట్ వద్ద గ్రనేడ్ బ్లాస్ట్ జరగడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. సంఘటన స్థలానికి దగ్గర్లో ఒక వివాహ వేడుక జరుగుతున్న నేపథ్యంలో, బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడ గ్రనేడ్ విసిరినట్లుగా స్థానికులు చెప్తున్నారు.
 
భారత దేశ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టంగా వున్నప్పటికీ ఉగ్రవాదులు రహస్య మార్గాల ద్వారా చొరబడుతున్నారు. ఉగ్రవాదులను ఏరివేయడానికి భద్రతా బలగాలు నిత్యం కూంబింగ్ ఆపరేషన్లను చేస్తూనే ఉన్నాయి. బోర్డర్ లో భద్రతను మరింత పెంచాయి. అయినప్పటికీ ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న ఆర్మీక్యాంప్‌ సమీపంలో పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఆర్మీక్యాంప్‌ సమీపంలోని త్రివేణి గేట్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున గ్రనేడ్‌ దాడి పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments