Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 యేళ్లు దాటిన వాహనాలపై హరిత పన్ను!

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (14:23 IST)
కేంద్ర ప్రభుత్వం వాహనదారుల జేబుకు చిల్లుపెట్టనుంది. 15 యేళ్లు దాటిన వాహనాలకు హరిపన్నును వసూలు చేయనుంది. అలాగే, 8 సంత్సరాలు దాటిన వాహనాలపై కూడా 10 నుంచి 25 శాతం మేరకు హరిత పన్నును వసూలు చేయనుంది. ప్రస్తుతం దేశంలో సుమారుగా 4 కోట్లకు పైగా వాహనాలు ఉన్నట్టు ఓ అంచనా. ఈ వాహనాలపై హరిత పన్నును విధించబోతున్నట్టు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ప్రకటించింది. అందులో కర్ణాటకవే 70 లక్షల దాకా పాత వాహనాలున్నట్టు చెప్పింది.
 
అయితే, తెలుగు రాష్ట్రాల వివరాలు అందుబాటులో లేకపోవడంతో వాటిని వెల్లడించలేదు. మధ్యప్రదేశ్, లక్షద్వీప్‌ల వివరాలూ కేంద్రం వద్ద లేవట. ఈ ఏడాది జనవరిలోనే హరితపన్నుపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనను ఇప్పుడు అమలు చేయడానికి సిద్ధమైంది.
 
4 కోట్ల పాత వాహనాల్లో సగానికిపైగా 20 యేళ్లు దాటిన వాహనాలేనని కేంద్రం చెప్పింది. కర్ణాటక తర్వాత అత్యధిక పాత వాహనాలున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తర్ ప్రదేశ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో 56.54 లక్షల పాత వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. అందులో 24.55 లక్షల వాహనాలు 20 ఏండ్లకు పైనవే కావడం గమనార్హం. 
 
దేశ రాజధాని ఢిల్లీ 49.93 లక్షల పాత వాహనాలతో మూడో స్థానంలోవుంది. ఆ రాష్ట్రంలో 20 ఏండ్లకు పైబడిన 35.11 లక్షల పాత వాహనాలున్నాయి. కేరళలో 15 ఏళ్లకు పైబడిన వాహనాలు 34.64 లక్షలుంటే.. తమిళనాడులో 33.43 లక్షలున్నాయి. పంజాబ్ లో 25.38 లక్షలు, పశ్చిమ బెంగాల్ లో 22.69 లక్షలున్నాయి. 
 
మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, హర్యానాల్లో 17.58 లక్షల నుంచి 12.29 లక్షల వరకున్నాయి. ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అసోం, బీహార్, గోవా, త్రిపుర, దాద్రానగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూల్లో లక్ష నుంచి 5.44 లక్షల వరకు పాత వాహనాలున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments