Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన సినీ నటి ప్రగ్యా జైస్వాల్

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:45 IST)
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నూతన ఉత్సాహంతో ముందుకు కొనసాగుతుంది. ప్రముఖులు ఒకరి నుండి  ఒకరు చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడానికి ఉత్సాహం చూపుతున్నారు. 

నటి పాయల్ రాజ్ పుత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ ప్రజ్ఞ జస్వాల్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "అందరూ బాధ్యతగా మొక్కలు నాటాలి. మొక్కల నుండి వచ్చే ఆక్సిజన్ తోనే మనం ఈ రోజు జీవనం కొనసాగిస్తున్నా.

మనకు ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ ను మనం చాలా డబ్బులు ఖర్చు చేసి కోనడం జరుగుతుంది. అలాంటి ఆక్సిజన్ ఉచితం గా ఇచ్చే మొక్కలను నాటి సంరక్షించే బాధ్యత మనందరిపై ఉన్నది. ప్రతి మనిషి కనీసం మూడు మొక్కలు నాటా"లని పిలుపునిచ్చారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందు తీసుకబోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ కి అభినందనలు తెలియజేశారు.

ఈ చాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని, అందులో భాగంగా సినీ నటి రెజీనా కసండ్రా, డైరెక్టర్ బోయపాటి శ్రీను, ప్రముఖ యోగా గురు అనుష్క లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి  మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
 
ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు "వృక్ష వేదం" పుస్తకంను ప్రజ్ఞా జైస్వాల్ కు అందజేయడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments