సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడు. అతని సందేశాలు చూసి ఆకర్షణకు గురైంది యువతి. మంచి వ్యక్తి అనుకుంది. అందుకే పిలిచిన వెంటనే వెళ్ళింది. కానీ చివరకు నమ్మిన వ్యక్తే దారుణంగా అత్యాచారం చేస్తాడని ఊహించలేదు. లబోదిబోమంటూ చివరకు పోలీసులను ఆశ్రయించింది.
పుణేలోని హింజెవాడీలోని నివాససముండే మహిళకు సోషల్ మీడియా ద్వారా యువకుడు పరిచయమయ్యాడు. తాను ఉంటున్న ప్రాంతానికి సమీపంలోనే అతను ఉండేవాడు. దీంతో ఆ యువతి అతనికి దగ్గరైంది. ఆన్‌లైన్ పరిచయం కాస్తా స్నేహానికి దారితీసింది.
స్నేహితుడిగా అతన్ని నమ్మింది. అతని పేరు పంకజ్. బర్త్ డే పార్టీ ఉందని మూడురోజుల క్రితం ఇంటికి పిలిచాడు. ఇంట్లో ఫంక్షన్ మొత్తం పూర్తయ్యింది. హోటల్లో తన ఫ్రెండ్స్ ఉన్నారని.. నువ్వు వస్తే బాగుంటుంది... కాసేపు ఉండి ఆ తరువాత వెళ్ళిపో అన్నాడు. దీంతో పంకజ్ మాటలు నమ్మి హోటల్ గదికి వెళ్ళింది.
హోటల్ గదిలో ఎవరూ లేరు. కానీ పంకజ్ మాత్రం ఫ్రెండ్స్ మరికాసేపట్లో వస్తారని మద్యం తాగడం ప్రారంభించాడు. వద్దన్నా యువతికి కూడా తాగించాడు. ఫుల్లుగా మద్యం తాగించడంతో ఆ యువతి స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెపై అత్యాచారం చేశాడు పంకజ్.
చివరిక తెల్లవారుజామున యువతి లేచి చూసే సరికి తన ఒంటిపై బట్టలు లేవు. దీంతో తను మోసపోయానని తెలుసుకుని అతడి గది నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు పంకజ్ పరారీలో ఉన్నాడు.