శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఏంటదో తెలుసా?

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (14:47 IST)
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు రోజుకు 1000 మంది భక్తులను మాత్రమే పరిమిత సంఖ్యలో అనుమతిస్తుండగా... వారాంతంలో మాత్రం ఆ సంఖ్యను 2వేలకు పరిమితి చేసింది. 
 
ఇక రోజు అయ్యప్పస్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్యను పెంచేలా అనుమతి ఇవ్వాలని ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పలు సూచనలు చేసింది. అయితే అన్ని శాఖలతో ప్రభుత్వం చర్చించాకే దీనిపై తుది నిర్ణయం వెలువడుతుందని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఇక కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ఆలయం మూత పడింది. దీంతో భక్తుల దర్శనం లేక ఆలయం కూడా ఆర్థికంగా చితికిపోయింది.
 
ఇక నిలక్కల్ దగ్గర కరోనా పరీక్ష కేంద్రాల నుంచి సన్నిధానం వద్ద ఉన్న శానిటైజేషన్ వ్యవస్థ వరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.లాక్‌డౌన్‌కు ముందు సీజన్ సమయంలో రోజుకు 80వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే వారని... ఆ సమయంలో రూ.263 కోట్లు మేరా రెవిన్యూ వచ్చేదని అధికారులు తెలిపారు. 
 
ఇక ఈ సారి ఆంక్షలు అమల్లోకి రావడంతో వ్యాపారస్తులు కూడా దుకాణాల టెండర్లకు దూరంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇక ఈ సారి హుండీ ఆదాయం కూడా చాలా వరకు తగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments