Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ వాహనాలకు చెక్.. ఇకపై అధికారులకు ట్యాక్సీలే అద్దె వాహనాలు.. కేంద్ర నిర్ణయం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ అధికారులంతా ఇకపై ట్యాక్సీల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ వాహనాలను వినియోగించడానికి వీల్లే

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (13:37 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ అధికారులంతా ఇకపై ట్యాక్సీల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ వాహనాలను వినియోగించడానికి వీల్లేకుండా ఆదేశాలను జారీ చేయనుంది. పైగా, ఈ రిజిస్టర్ ట్యాక్సీలనే అద్దె వాహనాలుగా పరిగణించనుంది. 
 
అనేక అధికారులు ప్రభుత్వ సొమ్ముతో విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసిన వాటిలో తిరగుతుంటారు. మరికొంతమంది ప్రభుత్వ అధికారులు వారి కుటుంబసభ్యులు.. బంధువుల పేరుమీద విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసి వాటినే అధికారిక వాహనాలుగా లీజుకు తీసుకుంటున్నారు. ఈ విషయం సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ నిగ్గు తేల్చింది. దీనిపై ఓ నివేదికను కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు సమర్పించింది.
 
దీంతో ఇకపై అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన కార్లను కాకుండా.. కేవలం ట్యాక్సీగా రిజిస్టర్‌ అయిన కార్లనే వినియోగించాలని ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం. అంతేకాదు.. ట్యాక్సీ ఎంత దూరం ప్రయాణించింది.. ఏ పనిపై తీసుకుకెళ్లారన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలని తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments