Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో కమలం పార్టీకి చుక్కలు.. యూపీలో సొంత ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ?

గోవాలో బీజేపీ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. గోవాలో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకున్న కమలం పార్టీకి కళ్లుబయర్లుకమ్మాయి. గోవా సీఎం లక్ష్మీకాంత్, కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ రఘునాథ్ చేతిలో ఓడిపోయార

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (10:00 IST)
గోవాలో బీజేపీ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. గోవాలో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకున్న కమలం పార్టీకి కళ్లుబయర్లుకమ్మాయి. గోవా సీఎం లక్ష్మీకాంత్, కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ రఘునాథ్ చేతిలో ఓడిపోయారు. మొత్తం 40 స్థానాలున్న అసెంబ్లీలో 1 ఫలితం, 18 స్థానాల ట్రెండ్స్ వెల్లడి కాగా, కాంగ్రెస్ ఒక చోట గెలిచి, 7 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ 7 చోట్ల, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతమాత్రమూ ప్రభావం చూపలేకపోయిందని ఫలితాలను బట్టి తెలుస్తోంది. 
 
ఇకపోతే.. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన సమాజ్ వాదీ, ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమైంది. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో 338 స్థానాల ట్రెండ్స్ వెల్లడవుతుండగా, బీజేపీ కూటమి 237 స్థానాల్లో సత్తా చాటింది. తద్వారా సొంత సర్కారు ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. ఇక సమాజ్ వాదీ పార్టీ 69 సీట్లలో ఆధిక్యంలో నిలిచింది. అలాగే బీఎస్పీ 29 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరో 65 స్థానాల ట్రెండ్స్ వెల్లడి కావాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments