Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా సర్కారు అవినీతిలో కూరుకుంది.. ఎమ్మెల్యేలు డబ్బు లెక్కించుకుంటున్నారు... బీజేపీ నేత

ఠాగూర్
శుక్రవారం, 7 మార్చి 2025 (09:47 IST)
ఆయనో బీజేపీ నేత. పేరు పాండురంగ మడైకర్. గోవాలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ చిన్నపని కోసం తాను సొంత పార్టీకి చెందిన మంత్రికి రూ.20 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ విషయంపై గోవా బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. లంచం పుచ్చుకున్న మంత్రిపేరును బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు. గోవాలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకునిపోయిందని, మంత్రులు డబ్బులు లెక్కపెట్టుకోవడంలో బిజీగా ఉన్నారని పాండురంగ ఆరోపించారు. అయితే, ఈ సందర్భంగా ఆయన ఏ ఒక్క నేత పేరును ప్రస్తావించలేదు. 
 
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మంగళవారం బీజేపీ నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. దీనికి హాజరైన పాండురంగ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు ఓ చిన్న పని కోసం మంత్రికి తాను స్వయంగా రూ.15 నుంచి రూ.20 లక్షలు సమర్పించుకున్నట్టు తెలిపారు. 
 
మంత్రులందరూ డబ్బులు లెక్కపెట్టుకోవడంలో బీజేపీ ఉన్నారు. గోవాలో ఏమి జరగడం లేదు అని ఆరోపించారు. దివంగత మనోహర్ పారికర్ క్యాబినెట్‌లో పాండురంగం మంత్రిగా పని చేశారు. నేను కూడా మంత్రిగా పని చేశాను. కాబట్టి మంత్రులు ఎలా పని చేస్తారో నాకు తెలుసు. ఒక చిన్న పని కోసం స్వయంగా నేనే రూ.15 నుంచి రూ.20 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. అంత డబ్బు తీసుకున్నా మని మాత్రం చేయలేదు. నా ఫైలు పెండింగ్‌‍లో పెట్టారు. నేను ఫోను చేస్తే నన్ను కలిసేందుకు కానీ, మా పని చేసిపెట్టడానికి కానీ నిరాకరిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుటుంబంతో కలిసి ఓజీ చూశాను : చిరంజీవి

Pawan Kalyan OG Response: తెలంగాణ, ఆంధ్రలోనూ ఓజీ పరిస్థితి ఏమిటి..

Chiru: 4కే కన్వర్షన్ తో రీ రిలీజ్ అవుతున్న చిరంజీవి కౌబాయ్ మూవీ కొదమసింహం

Ram: సెట్స్ నుండి ఆంధ్రకింగ్ తాలూకా గ్యాంగ్ ఏమంటున్నారంటే...

నాని ప్యారడైజ్‌లో డ్రాగన్ హీరోయిన్ కయాదు లోహర్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

తర్వాతి కథనం
Show comments