Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిపై ఫిజికల్ టీచర్ లైంగిక వేధింపులు.. పాఠశాలపై రాళ్లదాడి..

ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటం ఫ్యాషనైపోయింది. తాజాగా ఈరోడ్డుకు చెందిన ఓ పాఠశాల విద్యార్థినిని ఆ స్కూలు పీటీ టీచర్ లైంగికంగా వేధించాడు. లైంగిక వేధింపులకు గురిచేసిన విషయాన్ని

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (15:19 IST)
ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటం ఫ్యాషనైపోయింది. తాజాగా ఈరోడ్డుకు చెందిన ఓ పాఠశాల విద్యార్థినిని ఆ స్కూలు పీటీ టీచర్ లైంగికంగా వేధించాడు. లైంగిక వేధింపులకు గురిచేసిన విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఇన్నాళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థిని ఇక లాభం లేదనుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో మండిపడిన బాలిక తల్లిదండ్రులు, ప్రజలు స్కూల్‌పై రాళ్లను రువ్వి.. దాడికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఈ-రోడ్డు, భవానికి సమీపంలో ఉన్న ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాధిత బాలిక పట్ల పీటీ టీచర్ లైంగికంగా వేధించాడు. దీన్ని బయటికి చెప్పుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. 
 
విద్యార్థిని పట్ల లైంగికపరమైన వేధింపులకు గురిచేసిన టీచర్‌పై స్కూల్ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు డిమాండ్ చేశారు. అయితే స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడంతో.. పాఠశాలపై రాళ్లతో దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం