Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎస్ రామ్మోహనరావుకు రాం రాం.. తమిళనాడు సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్‌

టీటీడీ బోర్డు సభ్యుడు, నల్ల కుబేరుడు శేఖర్ రెడ్డికి తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహనరావుకు లింకుందంటూ ఆధారాలు అందడంతో.. ఐటీ అధికారులు బుధవారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసి

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (12:33 IST)
టీటీడీ బోర్డు సభ్యుడు, నల్ల కుబేరుడు శేఖర్ రెడ్డికి తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహనరావుకు లింకుందంటూ ఆధారాలు అందడంతో.. ఐటీ అధికారులు బుధవారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహనరావును ఆ పదవి నుంచి తొలగించారు. ఐటీ సోదాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించినట్లు వార్తలు అందడంతో.. కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్‌ను నియమిస్తూ తమిళనాడు సర్కారు నిర్ణయం తీసుకుంది. 
 
దివంగత ముఖ్యమంత్రి జయలలిత హయాంలో సీఎస్‌గా నియమితులైన రామ్మోహనరావు, ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లపై 13 ప్రాంతాల్లో దాదాపు 25 గంటల పాటు ఆదాయపన్ను శాఖ దాడులు జరిగిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 5.30 నుంచి గురువారం ఉదయం 6.30 వరకు ఐటీ దాడులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మాయనిమచ్చగా మారిందని అన్ని పక్షాల నుంచి విమర్శలు రావడంతో సీఎం పన్నీర్ సెల్వం హుటాహుటిన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పి. రామ్మోహనరావును తొలగించాలని నిర్ణయించుకుంది. 
 
అంతేగాకుండా గిరిజా వైద్యనాథన్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గిరిజా వైద్యనాథన్.. ముందునుంచి తమిళనాడులోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తొలగించిన రామ్మోహనరావు 1985 బ్యాచ్‌కి చెందినవారు. ఆయన కంటే గిరిజా వైద్యనాథన్ సీనియర్ కావడంతో ఈ పదవి ఆమెను వరించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ కాంబోలో యుఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి

ప్రభాస్ లో డెడికేషన్ చూశా, పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments