Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతుందని కుమార్తెను హత్య చేసిన తల్లి

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (17:35 IST)
తన కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతుండటాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి కన్నబిడ్డను హత్య చేసింది. ఈ విషయాన్ని ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. పైగా, హత్య కేసులో ఇరుక్కోకుండా ఆధారాలను మాయం చేసింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల ఘజియాబాద్‌లో ఒక యువతి మృతదేహాన్ని బైక్‌పై కొందరు తీసుకువెళుండటాన్ని గమనించిన సంగమ్ విహార్‌వాసులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, పలు విషయాలు వెల్లడించారు. ఓ యువతి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో 42 యేళ్ల మహిళ కూడా ఉంది.
 
ఆమె పోలీసుల విచారణలో అసలు విషయం చెప్పింది. తన కుమార్తె బాయ్‌ప్రెండ్‌తో తిరుగుతుండటాన్ని గమనించి, గత మూడు నెలల్లో 8 అద్దె ఇళ్లను మార్చామని, అయినప్పటికీ తన కుమార్తె తీరులో మార్పురాలేదని వాపోయింది. ఈ కారణంగానే ఆమెను హత్య చేసినట్టు అంగీకరించింది. తన కుమారుడు స్నేహితులతో కలిసి మృతదేహాన్ని తరలిస్తుండగాచిక్కినట్టు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments