Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై ఆరోపణల వెనుక పెద్ద శక్తి : సీజేఐ రంజన్ గొగోయ్

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (17:06 IST)
తనపై ఓ మాజీ మహిళా ఉద్యోగిని చేసిన లైంగిక ఆరోపణల వెనుక పెద్ద శక్తే ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అన్నారు. వచ్చేవారంలో పలు కీలక కేసుల విచారణ జరుగనుందని, అందుకే ఆ పెద్ద శక్తి ప్రోద్భలంతో ఓ మహిళ తనపై అసత్య ఆరోపణలు చేసిందని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాను ఈ వ్యాఖ్యలను ఖండించడం లేదని న్యాయ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. 
 
రంజన్ గొగోయ్ తనను లైంగికంగా వేధించాడంటూ సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగిని ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలు సంచలన ఆరోపణలు చేసింది. వీటిపై సీజేఐ స్వీయ నేతృత్వంలోనే త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి అత్యవసరంగా విచారణ చేపట్టారు. ఈ విచారణ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
న్యాయవ్యవస్థను అస్థిరపర్చే కుట్ర జరుగుతోందని, ప్రస్తుతం దేశ న్యాయవ్యవస్థ పెనుముప్పులో ఉందని అన్నారు. అంతేకాదు.. దీని వెనుక ఓ పెద్ద శక్తే ఉందని ఆయన ఆరోపించారు. అయితే, ఆ పెద్ద శక్తి ఎవరో ఆయన వెల్లడించలేదు.
 
సాక్షాత్ రంజన్ గొగోయ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. కీలక తీర్పులు చెప్పే సీజేనే ఇలా వాపోయారంటే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి? కారణాలేంటి? అనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సీజేఐ చెప్పినట్లు న్యాయవ్యవస్థ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం