Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదవి ఇప్పిస్తానంటూ రెండేళ్లుగా అత్యాచారం... యూపీ మంత్రిపై రేప్ కేసు

పార్టీలో పదవి ఇప్పిస్తానంటూ ఓ మహిళపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడింది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి, సమాజ్‌వాదీ నేత గాయత్రీ ప్రజాపతి కా

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (09:49 IST)
పార్టీలో పదవి ఇప్పిస్తానంటూ ఓ మహిళపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడింది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి, సమాజ్‌వాదీ నేత గాయత్రీ ప్రజాపతి కావడం గమనార్హం. దీంతో ఆయనపై సామూహిక అత్యాచారం కేసు పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
35 ఏళ్ల మహిళ ఫిర్యాదుపై స్పందించిన న్యాయస్థానం శుక్రవారం యూపీ పోలీసులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘‘నాకు సమాజ్‌వాదీ పార్టీలో మంచి పదవి ఇస్తామంటూ మంత్రి ప్రజాపతి ఆశ చూపారు. ఆయనతోపాటు మరికొందరు రెండేళ్లుగా నాపై అత్యాచారం చేస్తున్నారు. నా కుమార్తెను కూడా లైంగికంగా వేధించారు’’ అని చిత్రకూట్‌ ప్రాంతానికి చెందిన మహిళ ఆరోపించింది. 
 
దీనిపై ఆమె ఉత్తరప్రదేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, వారు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అఖిలేశ్‌ కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా పని చేస్తున్న ప్రజాపతి... ములాయంసింగ్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో యూపీ పోలీసులు ప్రజాపతిపై కేసు నమోదు చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం