Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిపై మోజుపడ్డాడు... భార్యను కాటికి పంపాడు.. ఎక్కడ?

వివాహేతర సంబంధాలు ఎంతటి ఘాతుకానికైనా పాల్పడేందుకు ప్రోత్సహిస్తాయి. తాజాగా కిరాతక భర్త ఒకడు తన మరదలిపై మోజుపడి కట్టుకున్న భార్యను కాటికి పంపించాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని బాగల్కోటె జిల్లా ముథోళ

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (09:35 IST)
వివాహేతర సంబంధాలు ఎంతటి ఘాతుకానికైనా పాల్పడేందుకు ప్రోత్సహిస్తాయి. తాజాగా కిరాతక భర్త ఒకడు తన మరదలిపై మోజుపడి కట్టుకున్న భార్యను కాటికి పంపించాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని బాగల్కోటె జిల్లా ముథోళ తాలూకా చిచఖండి అనే గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
చిచఖండి గ్రామానికి చెందిన రత్నమ్మ (25) అనే మహిళను చంద్రు కిలబనూరు (35) అనే వ్యక్తి కొన్నేళ్ళ క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో వరుసకు మరదలు అయిన రత్నమ్మ చెల్లిపై చంద్రు మోజుపడ్డాడు. ఆమెను మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. ఇందుకోసం భార్యను పథకం ప్రకారం హత్యచేశాడు. ఈనెల 14న ఇంట్లో గొంతు నులిమి హత్య చేసి పాముకాటుతో మృతి చెందినట్లు బంధువులను నమ్మించాడు. 
 
ఈ విషయమై స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం చేరవేయడంతో అదేరోజు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం జరపడంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం పోస్టుమార్టం నివేదికలో రత్నమ్మ గొంతునులమడంతోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈమేరకు భర్త చంద్రును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
 
మరదలిని పెళ్లి చేసుకోవాలని భార్యను చంపినట్లు అంగీకరించాడు. వెయ్యి రూపాయలు చెల్లించి పామును కొనుగోలు చేసిన విషయాన్ని విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. సమగ్ర సమాచారానికై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments