Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై వెళుతున్న 10 ఏళ్ల బాలిక కిడ్నాప్... గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (17:11 IST)
ఇంటికి రాని బాలికను వెతుక్కుంటూ వెళ్లిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. బయోగ్యాస్ ట్యాంక్‌లో శవం కనిపించింది. బుధవారం తన సమీప బంధువుతోపాటు వెళ్లిన బాలిక తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు అతడిని అడిగారు. అతడు తనకు తెలియదని, పాప ఇంటికి వచ్చేసిందనుకున్నానని సమాధానమిచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని కట్ని పట్టణంలో చోటుచేసుకుంది. 
 
బాలిక కోసం తల్లిదండ్రులు వెతికినా కనిపించలేదు. కట్నికి 80 కిమీ దూరంలో ఓ బయోగ్యాస్ ట్యాంక్ ఉంది. అందులో నుండి దుర్వాసన వస్తుండటంలో వెళ్లి చూసిన రైతుకు 10 ఏళ్ల బాలిక శవం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అది తప్పిపోయిన బాలికదే అని నిర్ధారించుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. 
 
వివరాల ప్రకారం, బాలిక రోడ్డుపై వెళుతుండగా కొందరి కామాంధుల కళ్లు పాపపై పడ్డాయి. ఆమెను వెంబడించిన దుండగులు, నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాక, బాలికపై అఘాయిత్యానికి దిగారు. నోరుని గట్టిగా మూసి తుప్పల్లోకి తీసుకువెళ్లారు. అత్యాచారానికి ఒడిగట్టి గొంతు నులిమి చంపేశారు. శవాన్ని తీసుకువెళ్లి బయో గ్యాస్ ట్యాంక్‌లో పడేసి అక్కడ నుండి పారిపోయారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం