జీ-20 సదస్సులో పాల్గొన్న రామ్‌ చరణ్‌ - ఘన స్వాగతం పలికిన అధికారులు

Webdunia
సోమవారం, 22 మే 2023 (17:13 IST)
జమ్మూకాశ్మీర్‌ వేదికగా జరుగుతున్న జీ-20 సదస్సులో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పాల్గొన్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ప్రాతినిథ్యం వహిస్తూ సోమవారం ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ మేరకు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
 
కాశ్మీర్‌లో ఆర్టికల్‌-370ను తొలగించిన తర్వాత అక్కడి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ప్రపంచానికి చాటేందుకు, పూర్వ పర్యాటక వైభవ పునరుద్ధరణకు ఇక్కడ సదస్సు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ప్రసిద్ధ దాల్‌ సరస్సు ఒడ్డున ఉన్న షేర్‌-ఏ-కాశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సెంటర్‌లో ఈ సదస్సు జరుగుతోంది. సోమవారం మొదలైన ఈ సదస్సు ఈ నెల 24వ తేదీ వరకు జరగనుంది. పర్యాటక, వాణిజ్యరంగాలపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
 
'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత రామ్‌ చరణ్‌.. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌'లో నటిస్తున్నారు. శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక. దిల్‌రాజు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments