Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుకు ఎంట్రీ నిరాకరించిన మాల్‌ యాజమాన్యానికి షాక్.. వారం రోజుల మూసివేతకు ఆదేశం!!

వరుణ్
గురువారం, 18 జులై 2024 (18:50 IST)
బెంగుళూరు మహానగరంలో పంచెకట్టుతో వచ్చిన ఓ రైతును మాల్‌లోకి అనుమతించలేదు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మాల్ యాజమాన్యంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో కర్నాటకలోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అన్నదాతను అవమానించే రీతిలో నడుచుకున్న ఆ మాల్‌ను వారం రోజుల పాటు మూసివేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ తరహా ప్రవర్తన వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడం కిందికే వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
కాగా, బెంగుళూరు నగరంలోని మాగడి రోడ్డులో ఉన్న జీటీ మాల్‌లోని మల్టీప్లెక్స్‌లో కుమారుడితో కలిసి సినిమా చూసేందుకు మంగళవారం ఓ రైతు వచ్చారు. ఆయన పేరు పకీరప్ప. హావేరి ప్రాంత వాసి. అయితే, ఆ రైతును చూసిన సెక్యూరిటీగార్డు గోపాల్‌ ఆ రైతును అడ్డుకున్నాడు. పంచె కట్టుకుని వచ్చిన రైతును లోపలికి అనుమతించలేదు. పకీరప్ప కుమారుడు దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
 
ఈ ఘటనపై రైతు సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించారు. మాల్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే, పంచెకట్టుతో వేల మంది రైతులు వచ్చి మాల్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దాంతో దిగొచ్చిన మాల్ యాజమాన్యం.. రైతుకు శాలువా కప్పి సత్కరించింది. అందరి ముందు క్షమాపణలు కోరింది. ఇకపై ఇటువంటి పొరపాటు చేయబోమని ప్రకటించింది. అయితే, కర్నాటక ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించి వారం రోజుల పాటు మూసివేతకు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments