భారత 74వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్రం ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికిగాను ప్రకటించిన ఈ పురస్కారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 12 మందికి ఈ పురస్కారాలు వరించాయి. వీరిలో సుమధుర గేయవాణి వాణీ జయరాం, స్వరకర్త కీరవాణిలు ఉన్నారు. అలాగే, చినజీయర్ స్వామికి పద్మ భూషణ్ ప్రకటించారు.
ఈ యేడాది మొత్తం 106కి పద్మ అవార్డులను ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ జాబితాలో 6 పద్మ విభూషణ, 9 పద్మభూషణ్, 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు, ఏడుగురు మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి ఏడుగురు, తెలంగాణ నుంచి ఐదుగురు పద్మ పురస్కారం దక్కిన వారిలో ఉన్నారు. అందులో చినజీయర్ స్వామికి పద్మ భూషణ్, సంగీత దర్శకుడు కీరవాణికి పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఇక తమిళనాడు నుంచి ఐదుగురు, పుదుచ్చేరి నుంచి ఒకరిని పద్మ పురస్కారాల కోసం ఎంపిక చేశారు. తమిళనాడు కోటాలో సీనియర్ గాయని వాణీ జయరాంకు పురస్కారం దక్కింది.