Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు కీచకపర్వం : నిందితులను గుర్తించిన కమ్మనహళ్లి బాధితురాలు

బెంగుళూరు సామూహిక లైంగిక వేధింపుల్లో కమ్మనహళ్లి బాధితురాలు తనను వేధించిన నిందితులను గుర్తించింది. ఇందుకోసం నిర్వహించిన పెరేడ్‌లో తనపై దౌర్జన్యానికి పాల్పడిన నలుగురిని ఆమె గుర్తించారు. ఈ నిందితులంతా కమ

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (09:47 IST)
బెంగుళూరు సామూహిక లైంగిక వేధింపుల్లో కమ్మనహళ్లి బాధితురాలు తనను వేధించిన నిందితులను గుర్తించింది. ఇందుకోసం నిర్వహించిన పెరేడ్‌లో తనపై దౌర్జన్యానికి పాల్పడిన నలుగురిని ఆమె గుర్తించారు. ఈ నిందితులంతా కమ్మనహళ్లి ప్రాంతానికి చెందినవారుగా తేలింది. నిందితులను అయ్యప్ప, లెనిన్‌ ఫ్యాట్రిక్‌, సోమశేఖర్‌, సుధీష్‌లుగా గుర్తించారు. మిగిలిన వ్యక్తులు తనకు తెలియదని- వారిని ఎన్నడూ చూడలేదని - పరిచయం లేదని స్పష్టం చేసింది.
 
నూతన సంవత్సరం సందర్భంగా స్నేహితులతో కలిసి చర్చికి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొని తెల్లవారుజామున 2 గంటల తర్వాత ఆటోలో ఇంటికి వచ్చినట్లు తెలిపారు. రహదారిపై దిగి ఇంటికి నడిచి వస్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు చుట్టుముట్టారని చెప్పారు. వారి నుంచి రక్షణ కోసం ప్రతిఘటిస్తూ కేకలు వేసినట్లు వివరించారు. ఓ యువకుడు దురుసుగా వ్యవహరించి లాక్కెళ్లి వాహనంపై కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడన్నారు.
 
తీవ్ర ప్రతిఘటనతో కేకలు వేశానని అదేసమయానికి అక్కడి ఓ ఇంటి దీపాలు వెలగడంతో దుండగులు నన్ను నెట్టేసి పరారైనట్లు ఆమె వివరించారని పోలీసు ఉన్నత వర్గాలు ధ్రువీకరించాయి. నలుగురు నిందితుల్ని న్యాయస్థానం ముందు హాజరు పరిచి ఈనెల పదో తేదీ వరకు కస్టడీలోకి తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం