Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను 4రోజుల పాటు గదిలో నిర్భంధించి.. లైంగిక దాడి చేసిన యువకుడు

బాలికకు పార్కు చూపిస్తానంటూ కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. మలక్ పేట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న హాస్టల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్న యువకుడు పక్కనే షాపులో పనిచేసే

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (09:40 IST)
బాలికకు పార్కు చూపిస్తానంటూ కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. మలక్ పేట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న హాస్టల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్న యువకుడు పక్కనే షాపులో పనిచేసే బాలికతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఇలా ఓ రోజు పార్కును చూపిస్తానని తీసుకెళ్లి.. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దూర్‌ మండలం, పల్సాపూర్‌ గ్రామానికి చెందిన పెండ రాజు (22) దిల్‌సుఖ్‌నగర్‌ భవానీనగర్‌లోని సిద్దివినాయక బాయ్స్‌, వర్కింగ్‌ మెన్స్‌ హాస్టల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌ నివాసి 16ఏళ్ల మైనర్‌ హాస్టల్‌ పక్కనున్న బ్యాంగిల్‌ స్టోర్‌లో పనిచేస్తుంది. పరిచయం పెంచుకున్న రాజు కొత్త సంవత్సరం రోజున లుంబినీపార్కు, ట్యాం క్‌బండ్‌ చూపిస్తానంటూ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో బైక్‌పై తన నివాసగ్రామమైన పల్సా పూర్‌ గ్రామానికి తీసుకెళ్లాడు. 
 
తన కూతురు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన మైనర్‌ తండ్రి సైదులు 2వ తేదీన మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన మలక్‌పేట ఎస్‌ఐ తులసయ్య కాల్‌డేటా ఆధారంగా రాజు పల్సాపూర్‌ గ్రామంలో ఉన్నట్లుగా గుర్తించి పట్టుకున్నారు. అనంతరం విచారణ జరపగా మైనర్‌ను నాలుగురోజుల పాటు గదిలో నిర్భందించి లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. నిందితుడు రాజుపై మైనర్‌ కిడ్నాప్‌, లైంగిక దాడి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం