Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి పట్టాలు తప్పిన సబర్మతి - ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు..

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (11:29 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ వద్ద ఆదివారం అర్థరాత్రి రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సబర్మతి - ఆగ్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మొత్తం నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం మాదర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఆదివారం అర్థరాత్రి ఒంటి గంటకురైలు ఇంజిన్‌తో పాటు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, పోలీసుల హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
రాత్రి తామంతా గాఢ నిద్రలో ఉండగా పెద్ద శబ్దం వినిపించిందని, చివరకు రైలు పట్టాలను తప్పినట్టు తెలిసిందని కొందరు ప్రయాణికులు వెల్లడించారు. కాగా, ఆర్పీఎఫ్ చెందిన సహాయక బృందాలు, రైల్వే పోలీసులు, అడిషినల్ డివిజనల్ రైల్వే మేనేజరు, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలంలోనే ఉడి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. పట్టాలు తప్పిన బోగీలను మళ్ళీ పట్టాలపైకి మళ్లించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే పీఆర్వో శశికిరణ్ తెలిపారు. ప్రయాణికుల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా హెల్ప్‌లైన్లను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments