Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెవి కమ్మలు కొనివ్వలేదని భర్తకు నిప్పంటించిన భార్య... ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (10:46 IST)
ఓ భార్య.... కట్టుకున్న భర్తపై తిరగబడింది. తాను అడిగిన చెవి కమ్మలు కొనివ్వలేదన్న కోపంతో భర్తకు నిప్పంటించింది. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం నగరంలోని నిజాంపేటలో నివసించే షేక్‌ యాకూబ్‌పాషా, సమీనా దంపతులు కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. తనకు చెవి దుద్దులు కొనివ్వాలని సమీనా భర్తతో తరచూ గొడవ పడుతోంది. 
 
ఈ విషయంపై శనివారం సాయంత్రం ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. తన వద్ద అంత డబ్బు లేదని.. కొనివ్వలేనని పాషా తేల్చిచెప్పారు. దీంతో క్షణికావేశానికి లోనైన సమీనా.. తన భర్తపై పెయింట్లకు సంబంధించిన  రసాయనాన్ని పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో అతను గాయపడ్డారు. పాషా తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 
 
ఆ రెండు దేశాల మధ్య యుద్ధం.. మూడో ప్రపంచ యుద్ధమే.. పుతిన్ హెచ్చరిక
 
నాటో దళాలు, రష్యా దళాల మధ్య యుద్ధమంటూ జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. అయితే, ఈ పరిణామాన్ని ఏ ఒక్కరూ లేదా ఏ ఒక్క దేశం కోరుకోదని ఆయన అన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన మరోమారు ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అమెరికా నేతృత్వంలోని నాటో మిలిటరీ కూటమి, రష్యా మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగితే ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం అంచున నిలుస్తుందన్నారు. 
 
రష్యా, నాటో దళాల మధ్య యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని, అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం అడుగుదూరంలో ఉంటుందని పశ్చిమ దేశాలను ఆయన సోమవారం హెచ్చరించారు. నాటో దళాలు, రష్యా మధ్య యుద్ధం ముప్పు పొంచివుందంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ వ్యాఖ్యానించారంటూ పుతిన్ వద్ద మీడియా ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధునిక ప్రపంచంలో అన్నీ సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానించారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని తాను భావిస్తున్నానని పుతిన్ అన్నారు. 
 
రష్యా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో ఇప్పటికే నాటో సైనిక సిబ్బంది ఉన్నప్పటికీ.. యుద్ధంపై చర్చించేందుకు ఫ్రాన్స్, ఇంగ్లండ్లను ఎంచుకున్నట్టు ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం తమకు లేదని, అలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదని పుతిన్ చెప్పారు. కాగా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు, రష్యా మధ్య సంబంధాలు అథమ స్థాయికి సన్నగిల్లిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments