Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో ఘోరం.. కారులో యువతిపై సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (13:02 IST)
బెంగళూరులో ఘోరం జరిగింది. కదులుతున్న కారులో ఓ యువతిపై నలుగురు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. బెంగళూరు నగర నడిబొడ్డున ఓ యువతిని ఆమె బాయ్‌ఫ్రెండ్ ముందే కారులో కిడ్నాప్ చేసి పలు ప్రాంతాల్లో సంచరిస్తూ కొన్ని గంటల పాటు అత్యాచారం చేయడం కలకలం రేపింది. 
 
బెంగళూరులోని ఈజీపురకు చెందిన ఓ యువతి, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మార్చి 25న రాత్రి 9.30 గంటల సమయంలో కోరమంగళలోని పార్కులో కూర్చుంది. ఆమె స్నేహితుడు ఇద్దరు స్నేహితులతో వచ్చాడు. వారు కారులో యువతిని కిడ్నాప్ చేశారు. 
 
రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అదే కారులో నిరంతరం ఆ యువతి మీద నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కామం తీర్చుకున్న యువకులు రోడ్డుపక్కన వదిలేసి పారిపోయారు. 
 
తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసింది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments